Header Banner

ఏపీలో తీవ్ర విషాదం.. సరదాగా ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు!

  Tue May 13, 2025 21:26        Politics

వైఎస్ఆర్ కడప జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల వేళ సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటనతో బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పిల్లల ఆచూకీ కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మల్లేపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు వేసవి సెలవులు కావడంతో మంగళవారం నాడు సమీపంలోని చెరువుకు ఈత కొట్టేందుకు వెళ్లారు. సాయంత్రం ఎంతసేపటికీ పిల్లలు ఇళ్లకు తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్ల వద్ద గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. గ్రామస్థులతో కలిసి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి చూడగా, అక్కడ గట్టుపై పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఈతకు వెళ్లి నీటిలో మునిగి గల్లంతై ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిపుణులైన గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, అధికారులు సాధ్యమైనంత వేగంగా పిల్లల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli